ముంబయి : గృహ రుణాలు జారీ చేసే వెస్టెండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా జగదీష్ కపూర్ నియమితులయ్యారు. ముంబయిలో జరిగిన ఆ కంపెనీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జగదీష్ కపూర్ ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా సేవలు అందించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు, బొంబాయి స్టాక్ ఎక్సేంజీకి ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉంది. పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంక్‌ల బోర్డుల్లోనూ సేవలు అందించారు.










