ప్రజాశక్తి-తాళ్లరేవు (కాకినాడ) : పంచాయతీ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తాళ్ళరేవు నామన వెంకాయమ్మ హైస్కూల్, మాధవరాయుని పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. తహశీల్దార్ ఎస్. పోతురాజు పర్యవేక్షణలో ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని దేవి, జడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, ఎంపీటీసీలు చిట్టూరి లలిత పద్మ, చలపతి, నంది కోళ్ల శ్రీదేవి, శ్రీమన్నారాయణ, రత్స ముత్యాలు, వైసిపి గ్రామ కమిటీ కన్వీనర్ ఆకుల వెంకన్న, కేశవ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ కొళ్ళు శ్రీనివాస్, బొంతు వీర మోహన్, పొన్నాడ భైరవమూర్తి, మోర్త రాంబాబు, పిల్లి మణికంఠ, గాడిమొగ పి.హెచ్.సి., కాకినాడ జిజిహెచ్ వైద్యులు, స్థానిక ఏఎన్‌ఎంలు రోజా, జ్యోతి, మేల్ అసిస్టెంట్లు, ఆశ, అంగన్వాడి వర్కర్లు, ఈవోపీఆర్డి మల్లాడి భైరవమూర్తి, పంచాయతీ కార్యదర్శులు నున్న శంకర్ నారాయణ, ఎం.వేణుగోపాల్, స్థానిక వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది సురేష్, కుమార్ లు ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఈసీజీ, కంటి వైద్య శిబిరం, జనరల్ చెకప్ వంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఏర్పాటుచేసిన శిబిరంలో ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు.










