ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : జగన్ కక్ష పూరిత వ్యవహారాన్ని మానుకోవాలని తుని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి యనమల దివ్య అన్నారు. మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మంగళవారం తేటగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేసి ఆయన విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ జగన్ రాజకీయ కక్షతోనే చంద్రబాబును జైల్లో పెట్టారని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలే కీలకమని జగన్ ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసిన వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు యొక్క సుపరిపాలన ఆయన యొక్క స్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసని , రాష్ట్రంలో జగన్ చేసే ప్రతి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అభివద్ధి, సంక్షేమం నవరత్నాల పేరుతో నాలుగు సంవత్సరాలలో ఎంత దోచుకున్నావో ప్రజలకు తెలిసిన నే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి శేషగిరిరావు, మోత్కూరు వెంకటేష్, సుర్ల లోవరాజు ,ఇనుగంటి సత్యనారాయణ అప్పన రమేష్, వంగలపూడి బుజ్జి ,చింతంనీడి అబ్బాయి, దంతులూరి శ్రీనివాస్ రాజు, కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.










