Nov 09,2023 19:05

'ఇంతకు ముందు తండ్రి పాత్రలలో నటించాను. కానీ హాయ్ నాన్న సినిమాలో ఓ అమ్మాయికి తండ్రిగా నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నాకు మొదటి నుంచి ఆడపిల్లలంటే ఇష్టం. ఈ సినిమాలో నటించడం మొదలు పెట్టాక కూతురుతో ఎలా ఉండాలో అనుభవం వచ్చింది. అందుకే నాకు ఓ కూతురుంటే బాగుండనిపిస్తోంది' అని నాని అన్నారు. నాని ప్రస్తుతం 'హారు నాన్న' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా బుధవారం ప్రముఖ ఆంగ్ల మీడియా ఇండియా టూడే నిర్వహించిన తెలంగాణ రౌండ్‌టేబుల్‌ 2023 సమావేశానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని సినిమా విశేషాలతో పాటు పైవిధంగా తన వ్యక్తిగత విషయాలపై కూడా స్పందించారు. ప్రస్తుతం నాని చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. డైరెక్టర్‌ శౌర్యువ్‌ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో నాని, మృణాల్‌ ఠాకూర్‌, నాని కుతురిగా కియారా ఖన్నా నటిస్తోంది. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందించారు.