'సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది. ఇలాంటి చెత్త వీడియోలను క్రియేట్ చేసే వ్యక్తి.. ఆ టెక్నాలజీని, విలువైన సమయాన్ని ఏదైన మంచి పనికి ఉపయోగించాల్సింది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీ మనకు వరమో లేక శాపమో అర్థం కావట్లేదు. ప్రేమను, మంచి పంచడం కోసం ఈ టెక్నాలజీని ఉపయోగిద్దాం.అంతేకానీ చెత్తను పంచుకోవడం కోసం కాదు' అని కీర్తి సురేశ్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రష్మిక డీప్‌ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. సినీ ప్రముఖుల నుంచి మొదలు ప్రభుత్వ పెద్దల వరకు ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించారు. ఈ వీడియోపై అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, మంచు విష్ణు, విజరు దేవరకొండ, మృణాళిని ఠాగూర్ లాంటి అగ్ర నటీనటులు స్పందించారు. తాజాగా కీర్తి సురేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఘటనపై స్పందించారు.