Aug 21,2023 14:47

ప్రజాశక్తి- రేపల్లె (బాపట్ల) : రాజ్యాంగంపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచేందుకు సెప్టెంబర్‌ 10న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ దళిత్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు తెనాలి క్రాంతి సుమన్‌ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుల నిర్మూలన కలయిక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్‌ జీవిత చరిత్ర, రచనలు, భారతదేశంలో సమానత్వం వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నా మని తెలిపారు. దేశ సమగ్రతకు, సామరస్యానికి ప్రతీక అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగమని పేర్కొన్నారు. రాజ్యాంగం గురించి తెలిస్తే సమాజపు స్థితిగతులు అర్థమవుతాయని వివరించారు. నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని రాత పరీక్ష నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పరీక్ష రాసేందుకు 15 ఏళ్లుపై డిన ప్రతి ఒక్కరూ అర్హులేనని, మెరిట్‌ వచ్చిన పది మందికి బహు మతులు అందించనున్నామని వెల్లడించారు. బహుమతులను రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రదానం చేస్తామన్నారు. దరఖాస్తు చేయు విధానం, సిలబస్‌, పరీక్ష వివరాల కోసం 7032686204, 9441268501 నంబర్లను సంప్రదించాలన్నారు.