Aug 23,2023 15:53

ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎర్రవరం గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, డ్రాయన్లు, ఏలేరు కాలువ స్నాన ఘట్టాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న హార్టికల్చర్‌ భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అనంతరం పెద్దనాపల్లి గ్రామంలో యంత్రాల ద్వారా కాలువల పూడికతీతల పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నీరుకొండ రామకుమారి, సర్పంచ్‌ బీశెట్టి అప్పలరాజు, వైసిపి సీనియర్‌ నాయకులు నీరుకొండ సత్యనారాయణ, అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు గ్రామ కార్యదర్శి రాజన్‌ రాజేంద్ర ఉన్నారు.