Oct 11,2023 19:30

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'భారతీయుడు 2'. ఈ చిత్రాన్ని శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్‌ను చెన్నైలో కమల్‌హాసన్‌ ప్రారంభించారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.