Jul 27,2023 15:55

న్యూఢిల్లీ : ఈ ఏడాది 2023 రుతుపవనాల సీజన్‌ ఇప్పటివరకు పరిశీలిస్తే కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదు కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఊహించనవిధంగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. గడచిన ఏడు వారాల్లో కొన్ని ప్రాంతాలు గతంలో కురిసిన వర్షాలను చవిచూశాయి. కొన్నిచోట్ల సాధారణ వర్షపాతమే నమోదైంది. ఏతావాతా మొత్తం వర్షపాతాన్ని పరిశీలిస్తే.. వరి పంటతో సహా, కొన్ని పంటలు నాశనమయ్యాయి. ఆస్తి నష్టంతోపాటు, ప్రాణ నష్టం కూడా సంభవించింది అని భారత వాతావరణశాఖ వెల్లడించింది. వరి పంటలు ధ్వంసమవ్వడంతో మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయ ధరలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం గురువారం విదేశాలకు పంపే నాన్‌ బాస్మతి వైట్‌ రైస్‌పై ఎగుమతి నిషేధాన్ని జారీ చేసింది.
మొత్తం మీద దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతం అని భావించే కొన్ని రాష్ట్రాల్లో అంచనాకి మించి భారీ వర్షాలు కురిశాయి. ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా పడింది అని వాతావరణ శాఖ తెలిపింది.