జననం నీది.. మరణం నీది
బాట నీది.. బతుకు నీది
ఆకలి నీది.. అవసరం నీది
కష్టం నీది.. కార్యం నీది !
మరి ..!
వాడెవ్వడు.. వీడెవ్వడు..
నిన్ను శాశించ వచ్చినోడు..
మేక తోలు కప్పుకున్న
పులులెందరు దేశంలో!
మేలు పేరు చెప్పి మోసగించే
దుర్మార్గులు, దుండగులు
ఎందరు మరెందరు
ఈ దేశంలో!
మూతి మీది బొంతపురుగు
మెలేసి నీ చెవులు పిండి
నీ అసహాయత సాక్షిగా..
బొటనవేలి ముద్రతో
భయపెట్టి.. బంధించి
బతుకు బజారుకీడ్చి
నరకంలో పడేస్తుండ్రు!
అందుకే..
జెర పైలం కొడకో ..
గుంజుకున్న నీ స్వతంత్రం
ధనదాహం పాలైంది
అధికారానికి దాసోహమైంది
రాచరికపు ఏలుబడిలో.. ఎప్పుడో
అది.. అస్తిత్వం కోల్పోయింది..!
న్యాలకంటి నారాయణ
95508 33490