- యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నా రాము
- నిరవధిక దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి కాకినాడ: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ 18వ తేదీ నుండి యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరవధిక దీక్షను విజయవంతం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నా రాము పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ హోమ్ నందు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర చక్రవర్తి ఆధ్వర్యంలో అక్టోబర్ 18వ తేదీ నుండి రాష్ట్ర కేంద్రంలో ఓ పి ఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జరిపేటువంటి నిరవధిక దీక్షలు విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ ను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి/అన్నారాము ఆవిష్కరించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఇంకా దుర్మార్గమైన జిపిఎస్ విధానం తీసుకురావడం ఉద్యోగులు ఉపాధ్యాయులను మోసగించడమేనన్నారు. చక్రవర్తి మాట్లాడుతూ అక్టోబర్ 18 వతేది నుండి రాష్ట్ర కేంద్రం లోనూ, 19వ తేదీ కాకినాడ యూటీఎఫ్ హోమ్ నందు 20వ తేదీ నుండి డివిజన్ కేంద్రాల లోను నిరవధిక దీక్షలు చేపడతామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు కలిసి వచ్చే సంఘాలను కలుపుకుంటూ యూటీఎఫ్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఐ ప్రసాదరావు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1 కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ పూర్తిచేసుకున్న అందరికీ కేంద్రప్రభుత్వ మెమో 57 ప్రకారం మన రాష్ట్రం లో ఉన్న 11 వేల మందికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్సులు తోట సీతారామయ్య, పెద్దిరాజు, నాగమణి, రేహిమాన్ బీ, జిల్లా ట్రెజరర్ గణేష్, గోవిందరాజులు, ప్రభాకర్, శ్రీరాములు సీఎహ్ వి రమణ, తదితరులు పాల్గొన్నారు.










