Mar 23,2023 16:07

ప్రజాశక్తి - గంపలగూడెం(ఎన్‌టిఆర్‌) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసమర్థత పాలన కొనసాగుతుందని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆరోపించారు. గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఇటీవల చెరుకూరు రాణి వర్ధంతిని పురస్కరించుకొని మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గురువారం 575 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను నెట్టెం రఘురాం విచ్చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మఒడి అని రోజుకు 30 రూపాయలు ఇచ్చి అదే సాయంత్రం 200 రూపాయలు గుంజుతున్నట్లు విమర్శించారు. వైసిపి గారడీ ప్రభుత్వంగా అభివర్ణించారు. రాష్ట్రంలో అసమర్ధుని జీవిత జీవన యాత్రకు పుల్‌ స్టాప్‌ పెట్టాలని అందుకు మళ్లీ చంద్రబాబు రావాలని కోరారు. ప్రజలంతా ఏకతాటిపై తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరచాలని నెట్టెం ఉద్ఘాటించారు. టిడిపిసీనియర్‌ నాయకులు చెరుకూరు రాజేశ్వర నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రేగళ్ల వీరారెడ్డి, చావాల దేవ దత్తు, దిరీసాల వెంకటకృష్ణారావు, ఎం ఆర్‌ కె తదితరులు పాల్గొన్నారు.