కాలం..
మౌనంగా మాట్లాడే పుస్తకం..
ఇష్టంగా చదువుకునే సంతోషం..
తిరేగేసేకొద్దీ
జ్ఞాపకాల తేమలో..
గతాన్ని చూపించే ఘట్టాలతో..
నడిచెళ్ళేకొద్దీ
అనుభవాల పునాదిపై
వర్తమాన కౌగిళ్ళతో
ప్రతి పేజీలో
గోప్యంగా దాగిన ప్రేమ
బహిరంగ రహస్యాలతో...
కొత్త ఏడాదిలో
తొలిరోజును స్వాగతిస్తూ
ఈ క్షణమే శుభప్రదం
తొలిమెట్టు కావాలి..
శ్రీ సాహితి
9704437247