మ్రోగింది ఎన్నికల నగారా
అంటారు మీరంతా హమారా
చెయ్యకు నీ ఓటును దుబారా
ఆలోచించి ఓటెయ్యండి..
భావిభారత పౌరులారా !
ఎలక్షన్ అనగానే..
మనకిస్తారు కలెక్షన్
నువ్వు అవుతావు ఎమోషన్
తరువాత బతుకంతా పరేషాన్
అందుకే తీసుకో సరైన డెసీషన్!
వస్తున్నారు రాజకీయ 'రా'బందులు
మీరే మా బంధువులంటారు
మీ ఊరునాది.. మీ వాడనాది..
గల్లీగల్లీ నాదంటారు.. ఊరంతా చుట్టేసి..!
ఐదేండ్లు కనిపించని నాయకుడు
ఇపుడు రోజూ దర్శనమిస్తాడు
ఎన్నెన్నో వరాలిస్తాడు..!
హామీల వర్షం కురిపిస్తాడు!
'ఓట్ల' కోసం 'నోట్ల' పందేరం ఆడుతాడు!
మీ ఓటును బుట్టలో వేసేసి..
నువ్వెవరో అంటారు!
సగం సచ్చిన శవమై నువ్వరుస్తుంటే..
రాబందులై పొడుచుకుతిని
రాజ్యమేలుతుంటారు!
అందుకే.. ఆ నాయకుణ్ణి
పసిగట్టి ప్రశ్నించు!
అభివృద్ధి చేసే..
నాయకుణ్ణి ఆదరించు!
అశోక్ గోనె
9441317361