
ప్రజాశక్తి - విజయవాడ : నగరంలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లను కష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మవారి పాదాల ఘాట్ వద్ద ఏర్పాటు చేసినట్లు ఎస్‌పి కాంతి రాణా టాటా తెలిపారు. ఈసందర్భంగా ఏర్పాట్లను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నీ శాఖల సమన్వయంతో నిమజ్జన ఘట్టాన్ని పూర్తి చేయాలన్నారు. నిమజ్జన సమయంలో అపశ్రుతులు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బందిని, లైటింగ్, బారికేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ జోన్ ఇన్ ఛార్జ్ డిసిపి కొల్లి శ్రీనివాస్, ఎస్.బి. ఏ.డి.సి.పి. సి.హెచ్. లక్ష్మీపతి, ట్రాఫిక్ ఏ.డి.సి.పి. టి.సర్కార్, పశ్చిమ డివిజన్ ఏ.సి.పి. డా.కే.హనుమంతరావు , టాస్క్ ఫోర్స్ ఏ.సి.పి. వర్మ, సౌత్ ఏ.సి.పి. డా.బి.రవికిరణ్, ట్రాఫిక్ ఏ.సి.పి. పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.