
ఈసారి సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి, అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్స్ సరిపోతాయా, లేక కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటాయా, అసలు చివరికి ఎన్ని ఉంటాయి బరిలో అనే చర్చ పరిశ్రమలో నడుస్తోంది. చాలా సినిమాలను సంక్రాంతి పండగకు విడుదల చేస్తామని తేదీలనుసైతం నిర్మాతలు ప్రకటించారు. ప్రభాస్ నటిస్తున్న 'సలార్' డిసెంబర్ 22న విడుదల కానుంది. ఆరోజు విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు కూడా సంక్రాంతి పండగ పోటీలో ఉండటం విశేషం. గుంటూరు కారం (మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్)), సైంధవ్ (వెంకటేష్, శైలేష్ కొలను), ఈగిల్ (రవి తేజ, కార్తీక్ ఘట్టమనేని), నా సామి రంగా (నాగార్జున, విజరు బిన్నీ), ఫామిలీ స్టార్ (విజరు దేవరకొండ, పరశురామ్ పెట్ల), హనుమాన్ (తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ), లాల్ సలాం (రజినీకాంత్, డబ్బింగ్ సినిమా), అయలాన్ (శివకార్తికేయన్, డబ్బింగ్ సినిమా) సంక్రాంతి రేసులో ఉన్నాయి.