Oct 31,2023 19:05

లోకేశ్‌ కనగరాజ్‌ రజినీ కాంబోలో రాబోతున్న 'తలైవా 171' చిత్రం గురించి లోకేశ్‌ ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను అందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని, నెక్ట్స్‌ సినిమాలో తలైవాలోని నెగెటివ్‌ షేడ్స్‌ను మరోసారి చూపించబోతున్నానని చెప్పాడు. 'రోబో సినిమా తర్వాత తలైవా 171లో తలైవా విలనిజాన్ని ఎలివేట్‌ చేయబోతున్నా. రజినీకాంత్‌ పాత్రకు చాలా షేడ్స్‌ ఉన్నాయి. స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకు తలైవా 171 చిత్రంలో రజినీలోని మరో కోణాన్ని పూర్తిగా ఆవిష్కరింబోతున్నాను. ఇది నా కెరీర్‌లోనే ఉత్తమ కథ' అంటున్నారు. ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోండగా.. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు.