Jan 04,2023 11:30

అమరావతి : ఏ విషయాన్నైనా సెర్చ్‌ చేయాలంటే... ముందుగా అందరూ గూగుల్‌ నే వాడతారు. గూగుల్‌లో వేటినైనా వెతకొచ్చు.. ఏ సమాచారాన్నైనా తెలుసుకోవచ్చునని అనుకుంటారు. గూగుల్‌లో ఏదిపడితే దాన్ని వెతకొచ్చులే అనుకుంటే తప్పు. కొన్ని విషయాల గురించి వెతికితే మాత్రం చిక్కుల్లోపడ్డట్టే..! దేశవ్యాప్తంగా క్రైం ను అరికట్టేందుకు కొన్ని కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. గూగుల్‌లో కొన్నిటిని గురించి వెతికారా ? వెంటనే సెక్యూరిటీ సర్వీసులు సదరు హానికర అంశాలను గుర్తించి పోలీసులకు సమాచారాన్నిస్తాయి. ఇంకేముంది.. మీ ఇంటికి పోలీసులు రావొచ్చు..!

వీటి గురించి గూగుల్‌ లో వెతక్కూడదు
బాంబ్‌ను తయారు చేయటమెలా ?
ప్రెషర్‌ కుక్కర్‌ బాంబ్‌ను తయారు చేయటమెలా ?
పిల్లల అశ్లీల చిత్రాలు,
పిల్లల లైంగిక వేధింపులతో కూడిన వీడియోలు
నేరాలకు సంబంధించిన ప్రశ్నలు
కిడ్నాపింగ్‌, నార్కోటిక్స్‌
అబార్షన్‌తో ముడిపడిన అంశాలు
వైద్యపరమైన అబార్షన్‌ విషయాల్లో కచ్చితమైన నియమాలున్నాయి.. వీటిల్లో లోపాలను తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు. ఇవన్నీ నేరం కిందికే వస్తాయి. వీటిని చూసినా, డౌన్‌లోడ్‌ చేసినా పోలీసులను ఇంటికి ఆహ్వానించినట్టే !