Oct 27,2023 07:58

తాను మరో ఐదేళ్లలో పెళ్లి చేసుకుంటానని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో సర్వేశ్‌ మేవారా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'తేజస్‌'. శుక్రవారం నాడు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లిపై తన అభిప్రాయాన్ని తెలిపారు. గతంలో బ్రేకప్‌ అయిన తన రిలేషన్స్‌ గురించి వెల్లడించారు. 'ప్రతి అమ్మాయి తన పెళ్లి, కుటుంబం గురించి కలలు కంటుంది. నేను కుటుంబ వ్యవస్థను ఎంతో గౌరవిస్తాను. పెళ్లి చేసుకుని నాకంటూ ఓ కుటుంబం ఉండాలని కోరుకుంటాను. ఇదంతా రానున్న ఐదేళ్లలో జరుగుతుంది. అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమైతే బాగుంటుంది. నేను తెలిసీ తెలియని వయసులో ప్రేమలో విఫలమయ్యాను. ప్రేమ విఫలమవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని చాలామంది జీవితంలో చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు' అని వివరించారు.