హైదరాబాద్: ఓఆర్‌ఆర్ టోల్ కాంట్రాక్టు సమాచారంపై ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఓఆర్‌ఆర్ టెండర్లపై ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వడం లేదని పిటిషనర్ కోర్టు దఅష్టికి తెచ్చారు. ఎంపీ అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే పార్లమెంట్‌లో ఎలా చర్చించగలరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాచార హక్కు చట్టం పరిమితుల మేరకు సమాచారం ఇస్తారని ఈ సందర్భంగా ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు రెండు వారాల సమయం కావాలని కోరారు. రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టుకు రెండు వారాలకు వాయిదా వేసింది.










