టొరంటో : భారత్, కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య కెనడా రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తమ అనుబంధం తమకు చాలా ముఖ్యమైనదే .. అయితే అదే సమయంలో నిజ్జర్ హత్య కేసులో విచారణ తప్పకుండా కొనసాగుతుందని అన్నారు. ''ఈ ఆరోపణలు నిజమైతే.. అది చాలా ఆందోళనకర అంశంగా మారుతుంది. మా దేశంలో మా పౌరుడిని హత్య చేయడం మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే'' అని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనడా మంత్రి బ్లెయిర్ వ్యాఖ్యానించారు.
ఇది సవాలుతో కూడుకున్న సమస్య అని తాము అర్థం చేసుకున్నామని, కానీ మా చట్టాలను గౌరవించడం, మా పౌరులను రక్షించుకోవడం తమ బాధ్యత అని అన్నారు. దీంతో ఈ కేసులో సమగ్ర దర్యాప్తును నిర్వహించి, వాస్తవాలను వెలికితీయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.