హైదరాబాద్ : హై ఎండ్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ కంపెనీ ఐడియాస్2ఐటితో హెల్త్‌టెక్ స్టార్టప్ ఐడియాఆర్‌ఎక్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా అధికారికంగా ప్లెడ్జ్2 ప్రొఫెల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆర్ధిక మందగమనం, ఉద్వాసనలతో సతమతమవుతున్న టెక్ నిపుణులకు అవసరమైన మద్దతు అందించడంతో పాటుగా అప్‌స్కిల్లింగ్‌తో నూతన అవకాశాలను అందించడం, వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూనే వ్యాపారవేత్తలుగా మారే అవకాశాలను అందించనున్నట్లు తెలిపాయి. ఉద్యోగాల కోసం వెదకడంలో ప్లెడ్జ్2ప్రొపెల్ సహాయపడుతుందని.. కానీ.. జాబ్ గ్యారెంటీ మాత్రం ఇవ్వదని పేర్కొన్నాయి.










