Apr 04,2023 21:04

న్యూఢిల్లీ : నేషనల్‌ ఇ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఇఎస్‌ఎల్‌)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐడిబిఐ బ్యాంక్‌ తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇ-బ్యాంక్‌ గ్యారెంటీ (ఇ-బిజి) సౌకర్యాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ''మా వినియోగదారులకు డిజిటల్‌ ఆఫర్‌ల ద్వారా సురక్షితమైన, వేగవంతమైన బ్యాంకింగ్‌ సేవలను అందించాలని కోరుకుకుంటున్నాము. ప్రధాన డిజిటల్‌ కార్యక్రమాలను జారీ చేసేందుకు బ్యాంకు ప్రతిసారీ ముందంజలోనే ఉంటూ వస్తోంది. ఇ-స్టాంపింగ్‌, ఇ-సిగేచర్‌ ద్వారా బ్యాంకు గ్యారెంటీ ప్రక్రియ డిజిటలైజేషన్‌ చివరి మైలు సవాళ్లను పరిష్కరించిన ఇ-బిజి సౌకర్యం కోసం ఎన్‌ఇఎస్‌ఎల్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది.'' అని ఐడిబిఐ బ్యాంక్‌ ఎండి, సిఇఒ రాకేష్‌ శర్మ పేర్కొన్నారు.