Nov 11,2023 17:54

ఇంటర్నెట్‌డెస్క్‌ : తొమ్మిది వందలకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ తన సినీ కెరీర్‌లో ఎన్టీఆర్‌ సినిమా విషయంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అది తననెంతో బాధించిందని, తన జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. 'నాగేశ్వరరావుతో కలిసి నేను 40 సినిమాల్లో నటించాను. అయితే ఎన్టీఆర్‌తో కలసి నటించే అవకాశాలు నాకు ఎక్కువగా రాలేదు. ఓ సినిమాలో ఎన్టీఆర్‌కి తమ్ముడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. చివరకు ఆ పాత్రలో బాలయ్యను ఎంపిక చేశారు. ఆ క్షణం నేను చాలా బాధపడ్డా. కానీ అదే సినిమాను తమిళ రీమేక్‌లో ఎంజీఆర్‌ తమ్ముడిగా నేనే నటించాను. ఆ సినిమాతో తమిళంలో నాకెంతో గుర్తింపు వచ్చింది' అని ఆయన అన్నారు.