ఈ మధ్య పత్రికలు
చదవాలంటేనే
భయం వేస్తోంది
అంతర్జాలంలోనూ
వాట్స్ యాప్‌లోనూ
కవితలు పుట్టుకు వస్తూనే వున్నాయి
నేను అనుకున్న వాక్యాలు,
ఆలోచించి పెట్టుకున్న
వైరుధ్యాలు...
నాకన్నా ముందే ఎవరో
రాసేస్తున్నారు..
ఎందుకు ఇంత ఆత్రుత?
నేను అనుకున్న కవితను
నేనుగా రాసేంత వరకూ వేచి
ఉండకూడదా?
తమిళంలో : మధువంతి
అనువాదం: గౌరీ కృపానందన్
97910 69485