Oct 13,2023 19:06

సినిమాల్లో ఎంతో కష్టపడి ఒళ్లు హూనం చేసుకుంటేనే తనకు తృప్తి ఉంటుందని సినీ హీరో చిరంజీవి వ్యాఖ్యానించారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా హీరోయిజం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 'ప్రతి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను కూడా ఎన్నిరోజులు ఇలా కష్టపడి డ్యాన్సులు, ఫైట్లు చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్‌ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్‌ వేసుకుని నటించి.. వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుని వచ్చేస్తే బాగుంటుంది. కానీ, అలాంటి పరిస్థితి మనది కాదు. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. అలా చేయకపోతే దర్శక-నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు. అందుకే కష్టపడాలి' అని అన్నారు.