Oct 19,2023 19:23

'అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లకు నేను వీరాభిమానిని. వాళ్లిద్దరూ నాకు చాలా ఇష్టం. నా రెండు కళ్లతో సమానం. కమల్‌ హాసన్‌ తన కళ్లతోనే హావభావాలు పలికించగలరు. అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ తన పాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు తెలియని సంతోషంగా అనిపిస్తుంది. ఆయన 'అగ్నిపథ్‌'లోని పాత్రను స్ఫూర్తిగా తీసుకోని 'ఘోస్ట్‌' సినిమాలో నా పాత్రను రాశారు. ప్రత్యేకించి బాడీ లాంగ్వేజ్‌ విషయంలో ఆయనలా చేయడానికి ప్రయత్నించాను' అని కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ చెప్పారు. ఆయన తన సినిమాలతో తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. మంచు విష్ణు నటిస్తున్న 'కన్నప్ప'లోనూ కీలకపాత్రలో శివరాజ్‌కుమార్‌ కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన సోదరుడు, నటుడు పునీత్‌ మన మధ్య లేడని అనుకోవడం లేదని; తాను ఎప్పటికీ మనతోనే ఉంటాడని చెప్పారు. కాగా, శివకుమార్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రల్లో నటించిన ఘోస్ట్‌ ఐదు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.