భూమ్మీద స్వేచ్ఛగా బతకడం ముఖ్యం
మాట్లాడే మాటల్లో
కదలాడే కాలాల్లో
నిర్భయంగా నడయాడటం ముఖ్యం
నువ్వున్న నేలపై
వీచే గాలిపై
విస్తరించిన ఆకాశంపై
చేతులు చాచి ఎగరటం ముఖ్యం
ఆంక్షలు, అసత్యాలు, అణచివేతలు
మనిషిని మనిషి నుంచి దూరం చేసే పన్నాగాలు
రక్తమోడుతున్న కాలం, కాటేసే దుర్మార్గాల్ని దాటి
ఎంత కష్టమైనా, స్వేచ్ఛే ముఖ్యం..
స్వేచ్ఛ కోసం, కొత్త ఋతువులు రావాలి
మనుగడ కోసం, మరో మార్పుగీతం కావాలి
పంజరం పక్షికి ఎప్పుడూ చిరునామా కాదు
ఆంక్ష ఎన్నడూ స్వేచ్ఛ కానేరదు
నియంతృత్వం, స్వాతంత్య్రపు చెలిమినీయదు.
- శిలాలోలిత