- ప్రధాన కార్యాలయం, జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
- పథకాల అమలు కష్టమంటున్న అధికారులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పౌర సరఫరాల శాఖను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా శాఖపై అవగాహన ఉండాల్సిన రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడం వల్ల దైనందిక కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తక్షణమే ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలని ఆ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు లేఖరాసారు.
ఇదే సమయంలో ఉద్యోగుల లేమి వల్ల కలుగుతున్న ఇబ్బరదులను కూడా ఆ లేఖలో వివరించారు. అందులోనూ ఆర్థిక, గణాంకాలు చూసే అధికారుల లేమి మరిరత వేధిస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యస్థీకరణ జరగకమురదు ఆర్థిక, గణాంకాల రంగానికి సంబంధించి 170 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 167 పోస్టులు ఉన్నాయి. ఇందులో 33 పోస్టులు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులతో ఉండగా, మిగిలిన 134 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పోస్టుల్లో కూడా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 20 ఖాళీలు ఉండగా, మిగిలిన 110 జిల్లా కార్యాలయాల్లో ఉన్నట్లు సమాచారం. మొత్తం ఖాళీలు ఉన్న పోస్టుల్లో అక్కౌంటెంట్ పోస్టుల ఖాళీలే అధికంగా ఉన్నాయి. ఖాళీల వల్ల నగదు నిర్వహణ, స్టాక్ మేనేజ్‌మెరట్, సబ్సిడీలు, ఆడిట్ నిర్వహణ వంటి అంశాల్లో సమస్యలు నెలకొంటున్నట్లు వివరించారు. ఆ శాఖ ఎక్కువగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, వాటికి సబ్సిడీలకు, ధాన్యం కొనుగోలు వంటి కీలక రంగాల్లో వెచ్చించాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఈ పద్దులను సమర్ధవంతంగా నిర్వహించలేక పోతున్నట్లు చెబుతున్నారు. తక్షణమే ఒక చీఫ్ ఆడిట్ ఆఫీసర్, ఒక చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఒక ఆడిట్ మేనేజర్లను ప్రధాన కార్యాలయంలో నియమించాలని ఆ శాఖ కోరుతోంది. ప్రధాన కార్యాలయం, జిల్లా కార్యాలయాల్లో 60 గ్రేడ్-1 అక్కౌంటెంట్లను, 33 గ్రేడ్-2, 28 గ్రేడ్-3 అక్కౌంటెంట్లను నియమించేందుకు అనుమతివ్వాలని ఆ శాఖ కోరుతోంది.










