నా హృదయం
విశాల జలమైదానం
సంఘర్షణల సంద్రం
ఆటుపోట్ల నిలయం
అల్లకల్లోలమై కెరటాలుగా
పాయలు పాయలై చీలి
పడుతూ లేస్తూ
గాయాలై నిరంతరం
బడబాగ్నులు నింపుకున్న రత్నగర్భయై
ప్రపంచానికి దూరంగా విసిరేయబడి
ఆ హృదయమొక విలాస సముద్రం
దూరపు చుట్టాల్లా వచ్చి దానిలో చేరి ముచ్చటగా మునకలేస్తారు అందరూ
కానీ శాశ్వతంగా ఉండరు ఎవ్వరూ
మురిపాలముచ్చట్లు తీరగానే
వదిలేసి వెళ్ళిపోతారు నిర్దయగా
ఆ హృదయ కడలి నొంటరిగా
హౌరున ఘోషింపజేస్తూ గుండె పగిలేలా
తన అంతర
మనోతీరమే శ్రమదీర్చే
ఆశ్రమమవుతుంది దానికప్పుడు
నిండు జాబిలి మాత్రం
మాసానికోమారొచ్చి చేస్తుంది
ఆ హృదయసంద్రంతో సహవాసం
కాసింత ఊరటగా
జలచరాలు గులకరాళ్లు గవ్వల్లాంటి స్వప్నాలే
దానికి మైత్రీ బృందం ప్రతిరేయి బాసటగా
నాగముని. యం
94908 56185