ఇంటర్నెట్‌డెస్క్ : సాధారణంగా రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు వంటి క్యాన్సర్ల వ్యాధుల గురించే చాలామందికి తెలుసు. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ (వీర్యగ్రంధి) గురించి తక్కువ మందికే తెలుసు. నేటికాలంలో.. అత్యధికమంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని కొన్ని పరిశోధనల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లుహెచ్‌ఓ) వెల్లడించింది. వివిధ రకాల క్యాన్సర్ వల్ల 2020 సంవత్సరంలో.. ఆ ఒక్క ఏడాదిలోనే పది లక్షలమంది మృతి చెందినట్లు డబ్య్లుహెచ్‌ఓ పేర్కొంది.
ప్రొస్టేట్ క్యాన్సర్ 50 ఏళ్ల పైబడిన పురుషుల్లో వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వయసు పెరిగిన కొద్దీ.. ఈ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని, నిర్లక్ష్యంతో చికిత్స తీసుకోకపోతే.. ఇతర అవయవాలకు సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- ఈ క్యాన్సర్ లక్షణాల్ని వెంటనే గుర్తించలేకపోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కణితులు ఏర్పడిన తర్వాత, వైద్య పరీక్షల్లోనే దీన్ని గుర్తించే అవకాశముంది.
- ఈ క్యాన్సర్‌కి గురైనవారిలో వెంట వెంటనే మూత్ర విసర్జన చేయడం, లేదా అకస్మాత్తుగా వెళ్లడం, డ్రాప్స్‌గా యూరిన్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ప్రొస్టేట్ క్యాన్సర్ వల్ల.. తొంటి, పొత్తికడుపులో నొప్పి విపరీతంగా ఉంటుంది. బరువు తగ్గుతారు.
- ప్రొస్టేట్ క్యాన్సర్ వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. స్థూలకాయం ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
- మూత్ర విసర్జన సమస్యలు ఎదుర్కొంటే వెంటనే యూరాలజిస్ట్‌ని సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్‌ని గుర్తించవచ్చు. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.