Aug 06,2023 17:00
  •  పొలాల్లోకి వెళ్లి తెచ్చుకుంటున్న మహిళలు

ప్రజాశక్తి-మడకశిర రూరల్‌ (సత్యసాయిజిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఒంటిపాళ్యం గ్రామంలొ గత నెలరోజులుగ మంచినీటి తీవ్ర కొరత ఏర్పడి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి కోసం కిలోమీటర్‌ దూరంలో ఉన్న రైతు పొలాల్లొకి వెల్లి తెచ్చుకొంటున్నారు. విద్యుత్‌ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే రైతుల బోరుబావుల వద్ద నీరు తెచ్చుకోవాలి లేదంటే మంచినీరు లేనట్లే గ్రామస్తులు అంటున్నారు. మంచినీటి సమస్యతో పనులకు వెల్లకుండా రైతుల బోరుబావుల వద్ద కాపుకాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు గ్రామప్రజలు. గ్రామంలో ఉన్న బోరు బావిలో మోటర్లు చెడిపోయినా పంచాయతి సర్పంచ్‌ నిమ్మకు నీరెత్తినట్లున్నారని, అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మొరపెట్టుకొంటున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి గ్రామంలోకి వస్తే తగినబుద్ది చెబుతామన్నారు గ్రామస్తులు. తక్షణం అధికారులు స్పందించి మాగ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని ..ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.