Oct 18,2023 19:32

హీరో కార్తీ చేస్తున్న కొత్త సినిమా 'జపాన్‌'. ఆయనకు ఇది 25వ సినిమా. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి థియేటర్లలోకి రానుంది. అఖిల భారత కార్తీ అభిమాన సంక్షేమ సంఘం ఉళవన్‌ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 25 రోజులపాటు 25 వేల మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. స్థానిక టీ.నగర్‌లోని కార్తీ అభిమాన సంఘం కార్యాలయంలో మంగళవారం దీనికి శ్రీకారం చుట్టారు. 'జపాన్‌' చిత్ర నిర్మాత ఎస్‌ ఆర్‌.ప్రభు, దర్శకుడు రాజు మురుగన్‌ ప్రారంభించారు.