Jun 22,2023 11:10

ప్రజాశక్తి-మారేడుమిల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో భారీ లారీ నిలిచిపోయింది. ఇంజిన్‌లో లోపంతో ప్రమాదకర మలుపులో నిలిచిపోవడంతో ఇరువైపుల భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. ఈ రోడ్డు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు వెళ్లే ముఖ్యమైనది కావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.పెద్ద సంఖ్యలో లారీలతో పాటు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. దీంతో బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీ నిలిచిపోయి సుమారు 10 గంటలు దాటి ట్రాఫిక్‌ స్తంభించినా ఇంతవరకు పోలీసులు అక్కడికి చేరుకోలేదు.