Jul 25,2023 11:20

దోర్నాల (ప్రకాశం) : దోర్నాల మండలం తుమ్మల బైలు చెంచుగూడెం సమీపంలోని నల్లమల ఘాట్‌ రోడ్డులో మంగళవారం బస్సు, టిప్పర్‌ ఢీకొన్న సంఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. సుమారు 2 గంటలపాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.