Jul 27,2023 16:16

పెద్దపల్లి : పట్టాలపై పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో ముందుజాగ్రత్తగా పెద్దపల్లిలో సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేశారు. ఈ రైలు గోరక్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు ఖాజీపేట రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌పై భారీగా వరద నీరు చేరింది. ట్రాక్‌పై దాదాపు రెండు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఆరు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. దాదాపు రైళ్లను దారి మళ్లించారు.