Sep 05,2023 14:43

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : ప్రతిరోజు గర్భిణీలు, బాలింతలు, మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనిఅంగన్వాడి సూపర్వైజర్‌ వెంకటలక్ష్మి అన్నారు.మంగళవారం స్థానిక పాత పెద్దాపురంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పౌష్టికాహార మాసోత్సవ సభ జరిగింది. ఈ సభలో వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారాన్ని తయారు చేసుకునే విధానాలపై ఆమె మహిళలకు వివరించారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో అంగన్వాడి కార్యకర్తలు తులసి, స్నేహలత, ఆయాలు కృపామణి, జయ, గర్భిణీలు, బాలింతలు, మహిళలు పాల్గొన్నారు.