హీరో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం 'హరోం హర'. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. మంగళవారంనాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. టీజర్ దీపావళికి విడుదల కానుందని పేర్కొన్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.