ఒకవైపు
నిర్లక్ష్యానికి చిహ్నం
మరోవైపు
వైపరీత్యానికి ఆగమనం
ఈ రెంటి నడుమ మనిషి
కాలుష్యపు కోరలు పెంచి
మసకబారిన వీధిలో
గాలిపటం అయ్యాడు
హరితం హరించినాక
మబ్బులు ఎరుగని నింగి
క్షామాన్ని వర్షించడం
ఎప్పుడో మొదలు పెట్టింది
పాలిపోయిన పర్యావరణంలో
రాలిపడుతున్న పత్రాలెన్నో
అటుఇటు కాని గమ్యాలెన్నో
నెల్లుట్ల సునీత
79894 60658