Apr 07,2023 12:42

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మక్కువ మండలంలోని క్రైస్తవ సోదరులు ఘనంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు జరుపుకున్నారు. సిలువ వేయబడిన ఏసుక్రీస్తును, ఆయన శ్రమలకు గురైన సంగతులను గుర్తు చేసుకుంటూ ... శుక్రవారం రోజున శుభ శుక్రవారం గా క్రైస్తవ సోదరులు జరుపుకుంటారు. మండల కేంద్రంలో స్థానిక ఆర్‌ సిఎం చర్చ్‌ దైవజనులు ఆధ్వర్యంలో సిలువ యాగం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రెల్లి వీధి జంక్షన్‌ నుండి సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఆర్సీఎం చర్చి వరకు ఊరేగింపు చేపట్టారు. సిలువ వద్ద ఏసుక్రీస్తు ప్రాణం విడిచి మళ్లీ సమాధి నుండి ఆదివారం సజీవుడగా లేచిన సందర్భాన్ని తలచుకుంటూ... ఈస్టర్‌ పండగ కూడా జరుపుకుంటున్నామన్నారు. ఈ దినాల్లో క్రైస్తవ సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిశ్రద్ధలతో ఆయా మందిరాల్లో ప్రార్థనలు చేస్తారని పాస్టర్లు తెలిపారు.