Oct 13,2023 19:30

హీరో మహేష్‌బాబుతో దర్శకుడు త్రివిక్రమ్‌ తీస్తున్న సినిమా గుంటూరుకారం. హారిక హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంక్రాంతికి విడుదల కానుంది. దసరా సందర్భంగా తొలి పాటని విడుదల చేయనున్నట్టుగా సమాచారం. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు సిద్ధం చేశారు. అందులోంచి ఓ పాట దసరాకి వినిపిస్తారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఓ ప్రత్యేక గీతం కోసం మరో స్టార్‌ హీరోయిన్‌ని తీసుకొస్తారని చిత్ర పరిశ్రమలో చర్చ నడుస్తోంది.