Aug 13,2023 15:11

ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం గ్రామానికి చెందిన జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పైడిమర్ల కిరణ్‌ కుమార్‌ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్‌.. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా రెండు లక్షల ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు కార్యదర్శి జానాలపాటి వేణుగోపాల్‌ రెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు ఉయ్యూరు రత్తారెడ్డి, మాజీ మండల తెలుగు యువత అధ్యక్షులు పాలంకి సురేష్‌ రెడ్డి, ఉయ్యురు బొర్రా రెడ్డి, కీర్తి రాయిగూడెం నాయకులు జమలయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.