
ఇంటర్నెట్‌డెస్క్ : చలికాలంలో తరచూ జలుబు, దగ్గులకు గురికావడం సాధారణ విషయమే. అయితే ఇంటి చిట్కాలతో జలుబు, దగ్గులకు చెక్ పెట్టొచ్చు. సాధారణంగా పసుపు లేదా శొంటి, మిరియాల పాలను తీసుకుటే జలుబు దగ్గుకు ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడూ వాటినే కాకుండా.. రుచికరంగా, సులభ పద్ధతిలో తయారుచేసుకునే శగనపిండి జీరాను తీసుకున్నా.. జలుబు, దగ్గుకు ఉపశమనం లభిస్తుంది.
శనగపిండి జీరా తయారుచేసే విధానం
నెయ్యి- టేబుల్ స్పూను, శనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు, కాచిన పాలు - కప్పు, బెల్లం - రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - పావు టేబుల్ స్పూను, పసుపు - చిటికెడు, యాలకుల పొడి - చిటికెడు.
కడాయిలో నెయ్యి వేసి వేడి చయాలి. తర్వాత అందులో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. శనగపిండి మంచి వాసన వచ్చేవరకు వేయించుకుని ముద్దలు రాకుండా.. పాలు వేసి కలుపుకోవాలి. అందులో మిరియాల పొడి, పసుపు, యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో బెల్లం వేసుకోవాలి.
శనపగిండి జీరా జలుబు, దగ్గుకు చక్కటి నివారణ. పసుపు, మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు జలుబు, దగ్గుకు ఉపశమనం కలిగిస్తాయి. దీన్ని రాత్రిపూట తీసుకుంటే.. ముక్కు దిబ్బడను నివారిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది.