Dec 18,2022 11:39

ఎన్ని రుచులు మన ముందున్నా, పచ్చడి అనగానే చవులూరటం సహజం. జిహ్వ చాపల్యం మరి ! పూర్వం పెరట్లో దొరికే కాయగూరలతోనే కాక ఆకుకూరలతోనూ పచ్చళ్ళు చేసుకునేవారు. అందుకే వారు చాలా కాలం ఆరోగ్యంగా ఉండేవారు. రానురాను ఆకుకూరల ఉపయోగం పప్పుతో కలిపి చేసుకోవడం వరకే పరిమితమైంది. వాడకంలో ఉన్నప్పటికీ కొన్నింటికే పరిమితమైన ఆకుకూరలూ ఉన్నాయి. వాటిలో కొత్తిమీర ఒకటి. ఇది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, అన్నికూరలపైన.. ఉడికిన తరువాత చివర్లో కొత్తిమీర తరుగును చల్లుకోవడం ఆనవాయితీగా మారింది. పుదీనా నాన్‌వెజ్‌ వంటలలో ఉపయోగిస్తాం. అయితే వీటన్నింటితో రోటి పచ్చళ్ళు చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. రోజువారీ ఆకుకూరలు తింటే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే. మరి ఈ వారం మనమూ ఆకుకూరలతో పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..!

kottimeera

                                                                               కొత్తిమీరతో..

కావలసినవి :  కొత్తిమీర - 100గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., జీరా : స్పూను, చింతపండు - 50 గ్రా., ఉప్పు, నూనె - తగినంత
తాలింపు కోసం : నూనె - 2 స్పూన్లు, ఆవాలు :1/2 స్పూను, పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలు - 8, కరివేపాకు
తయారీ : కొత్తిమీరను శుభ్రం చేసుకుని, పొడి క్లాత్‌ మీద నీడలో ఆరనివ్వాలి. బాండీలో స్పూను నూనెతో ఎండు మిరపకాయలు వేయించుకొని, అదే బాండీలో తరిగిన కొత్తిమీరను చెమ్మ పోయేవరకూ వేయించుకోవాలి. ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకొని, దానిలో చల్లారిన కొత్తిమీరను వేసి మిక్సీ పట్టి, వేరే గిన్నెలోకి తీసుకుని పోపు పెట్టుకోవాలి. అంతే నోరూరించే కొత్తిమీర పచ్చడి రెడీ.

mentikoora


                                                                            మెంతికూరతో..

కావలసినవి : మెంతికూర - 100 గ్రా., ఎండుమిర్చి - 75 గ్రా., జీరా : స్పూను, చింతపండు - 50 గ్రా., ఉప్పు, నూనె - తగినంత
తాలింపు కోసం : నూనె - 2 స్పూన్లు, ఆవాలు పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలు - 8, కరివేపాకు
తయారీ : మెంతికూర శుభ్రం చేసుకుని, పొడి క్లాత్‌మీద నీడలో ఆరనివ్వాలి. బాండీలో స్పూను నూనెతో ఎండు మిరపకాయలు వేయించుకొని, అదే బాండీలో మెంతికూరను చెమ్మ పోయేవరకూ వేయించుకోవాలి. ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకోవాలి. దానిలో చల్లారిన మెంతికూరను వేసి మిక్సీ పట్టి, వేరే గిన్నెలోకి తీసుకుని పోపు పెట్టుకోవాలి. అంతే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మెంతికూర పచ్చడి రెడీ.

 మెంతికూరతో..

                                                                                  పాలకూరతో..

కావలసినవి : పాలకూర - 100గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., జీరా : స్పూను, చింతపండు - 50 గ్రా., ఉప్పు, నూనె - తగినంత
తాలింపు కోసం : నూనె - 2 స్పూన్లు, ఆవాలు :1/2 స్పూను, పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలు - 8, కరివేపాకు
తయారీ : పాలకూరను శుభ్రం చేసుకుని, పొడిక్లాత్‌ మీద నీడలో ఆరనివ్వాలి. బాండీలో స్పూను నూనెతో ఎండుమిరపకాయలు వేయించుకొని, అదే బాండీలో తరిగిన పాలకూరను చెమ్మ పోయేవరకూ వేయించుకోవాలి. ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకొని దానిలో చల్లారిన పాలకూరను వేసి మిక్సీ పట్టి, వేరే గిన్నెలోకి తీసుకుని పోపు పెట్టుకోవాలి. అంతే రుచులు పంచే పాలకూర పచ్చడి రెడీ.

 పుదీనాతో..

                                                                                 పుదీనాతో..

కావలసినవి : పుదీనా - 100 గ్రా., ఎండుమిర్చి - 75 గ్రా., జీరా : స్పూను, చింతపండు - 50 గ్రా., ఉప్పు, నూనె - తగినంత
తాలింపు కోసం : నూనె - 2 స్పూన్లు, ఆవాలు పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలు - 8, కరివేపాకు
తయారీ : పుదీనాను శుభ్రం చేసుకుని, పొడి క్లాత్‌మీద నీడలో ఆరనివ్వాలి. బాండీలో స్పూను నూనెతో ఎండు మిరపకాయలు వేయించుకొని, అదే బాండీలో పుదీనా చెమ్మ పోయేవరకూ వేయించుకోవాలి. ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకొని దానిలో చల్లారిన కొత్తిమీరను వేసి మిక్సీ పట్టి, వేరే గిన్నెలోకి తీసుకుని పోపు పెట్టుకోవాలి. అంతే ఘుమఘుమలాడే పుదీనా పచ్చడి రెడీ.