ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్) : మండల పరిధిలోని శ్రీరాంపురం, పేర్వంచ రోడ్డు నుండి ఊర చెరువు మీదుగా రేగాటివాగు వెళ్లే రోడ్డు అభివృద్ధి పనులను, జెడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయ భాస్కర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అలాగే శ్రీరాంపురం రైతులు పంట పొలములోకి వెళ్లిందుకు గ్రావెల్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్దిరెడ్డి జమాలారెడ్డి, శ్రీరాంపురం సర్పంచ్ అట్లారి శ్రీనివాస్ రావు, ఎంపీటీసీ సభ్యులు గద్దల మారయ్య, తమత్క తిరుపతిరావు, మట్టా చిన్నబాయి, మట్టా తిరుపతి రావు, కిలారి సురేష్,మాజీ సర్పంచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










