Apr 20,2023 15:35

ప్రజాశక్తి - రేపల్లె(బాపట్ల) : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు గురువారం పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఆయన మరిన్ని పుట్టిన రోజు పండుగలు జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు. రాష్ట్రంలో విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడు పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునే విధంగా అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇటు విభజన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలను పొందారన్నారు. కార్యక్రమంలో జీవి నాగేశ్వరరావు, జివి రామారావు మేక పూర్ణచంరావు, పట్టాభి రామారావు మహిళా నాయకులు పాల్గొన్నారు.