Sep 05,2023 15:24

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్యజిల్లా) : మండలంలో ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో గురుపూజోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రమైన కలకడలోని గుర్రంకొండ రోడ్డులోని శ్రీ చైతన్య ప్రైవేట్‌ పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు, కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ నాగరాజా తెలిపారు. కృష్ణాష్టమి రోజు సెలవు కావడం వల్ల ముందస్తుగా వేడుకలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. చిన్నారుల చేత కృష్ణుడు గోపికల వేషాలు వేయించినట్లు తెలిపారు.అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి మిఠాయిలు పంచి పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాల్గొన్నారు.