రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్) : రైతులు పండించిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.1960 చెల్లించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ... ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గంపలగూడెం మండలం కనుమూరు గ్రామ రైతు భరోసా కేంద్రం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పగడాల వీరాంజనేయులు, రైతు సంఘం జిల్లా నాయకులు చెరుకు వీరారెడ్డి, కనుమూరి గ్రామ రైతులు జానపాటి వెంకటేశ్వరరావు, మాఊరి వెంకటేశ్వరెడ్డి, తుమ్మూరు నరసారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










