Aug 06,2023 15:06

హైదరాబాద్‌ : టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్‌ ఆమోదం లభించింది. ఉన్నతాధికారులతో చర్చించిన మీదట గవర్నర్‌ తమిళిసై ఎట్టకేలకు బిల్లను ఆమోదించారు. గవర్నర్‌ అనుమతితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. గవర్నర్‌ గ్రీన్‌ సిగల్‌తో టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ పేర్కొన్నారు. కాసేపట్లో సభ ముందుకు ఆర్టీసీ విలీన బిల్లు రానుంది. టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లును గత రెండు రోజులుగా గవర్నర్‌ పెండింగ్‌లో ఉంచడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. సంస్ధ ఉద్యోగులు, కార్మికులు ఛలో రాజ్‌భవన్‌కు పిలుపు ఇచ్చారు.