ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : వరద బాధితులు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీపీ రాయుడు సునీత అన్నారు. తాళ్ళరేవు మండలం పిల్లంక పంచాయతీ కొత్తలంక గ్రామంలో వరద బాధితులు 147 మందికి ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, నిత్యవసరాలను బాధితులకు ఎంపీపీ రాయుడు సునీత, జడ్పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు చింతలపాటి శ్రీనివాస్ రాజు అధ్యక్షతన జరిగిన సభలో వీరు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పోతురాజు ఎంపీడీవో ఎమ్. అనుపమ, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, ఉప సర్పంచ్ కాగిత రాజు, ఎంపీటీసీ మోర్త భీమాబాయి, వాలంటీర్ గోపాలకృష్ణ, అంగన్వాడీ వర్కర్ సుజాత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.










